త్రివిక్రమ్, దేవీ శ్రీ ల మధ్య అంతా ఓకేనా..?
టాలీవుడ్ స్టార్ డైరక్ట్ త్రివిక్రమ్, స్టార్ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ల రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఒకరికి మాటల మాంత్రికుడని పేరుంటే, మరొకరికి మ్యూజిక్ మాంత్రికుడంటూ పేరుంది. వీరిద్దరూ కాంబోలో సినిమా అంటేనే ఆ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ అని ఫిక్సయిపోతారు జనాలు. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా తో మొదలైన వీరి జర్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు సూపర్ హిట్ గా సాగింది.
కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ త్రివిక్రమ్, దేవి శ్రీ ప్రసాద్ ల కలయికలో సినిమాలు రాలేదు. ఇండస్ట్రీ లో వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, అందుకే వీరిద్దరి కాంబోలో అప్పటి నుంచి సినిమా రాలేదని టాక్ నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ సినిమాకు దేవీ పనిచేసింది లేదు. అందరూ దేవీ బిజీ ఉన్నాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాకు కూడా దేవీ లైన్ లోకి రాలేదు. ఆ తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు కూడా థమన్ సంగీతమిచ్చారు. దీంతో అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.
అయితే రీసెంట్ గా దేవీ కి, త్రివిక్రమ్ కు మధ్య రిలేషన్ బానే ఉందంటూ మళ్లీ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రీరికార్డింగ్ తో సన్నాఫ్ సత్యమూర్తి చూశాక హీరోకు నిర్మాతకు త్రివిక్రమ్ ఫోన్ చేసి, రూపాయి సినిమా తీస్తే దేవీ రెండు రూపాయల సినిమా చేశాడని చెప్పారట అని ఒక ఇంటర్వూలో దేవీ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్, దేవీ కలుకున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పై దేవీని త్రివిక్రమ్ పొగడటం, దేవి త్రివిక్రమ్ కు లవ్ యూ చెప్పడం చూస్తే వారి మధ్య మనస్పర్థలేమీ లేవని తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి.













