మరోసారి జత కట్టనున్న వెంకీ- త్రిష
చేసిన సినిమాలు ఎలాంటి ఫలితాన్నిచ్చినా విక్టరీ వెంకటేష్, త్రిష కాంబో అంటే అదొక రకమైన క్రేజ్. వీరిద్దరి కాంబోలో మొదటిసారిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో 2009లో నమో వెంకటేశా వచ్చింది. అది కూడా మంచి ఫలితాన్ని అందుకుంది.
కానీ 2012లో వీరి కాంబోలో వచ్చిన బాడీ గార్డ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే ఇక అసలు విషయానికొస్తే ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ కలిసే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి- వెంకటేష్ కలయికలో రానున్న విలేజ్ డ్రామా కోసం హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నారట.
ఇప్పటికే విశ్వంభర కోసం బల్క్ డేట్స్ ఇవ్వడంతో డేట్స్ క్లాష్ అవుతున్నాయని అంటున్నారు. కానీ అమ్మడు చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో సమ్మర్ లోపు ఎక్కువ శాతం సినిమాలు పూర్తైపోతాయి. కాబట్టి వెంకీ సినిమా ఒప్పుకునే ఛాన్సుంది. త్రిష ఒప్పుకుంటే మాత్రం అనిల్ రావిపూడికి హీరోయిన్ టెన్షన్ తీరినట్లే. అసలే సీనియర్ హీరోలకు హీరోయిన్స్ ను వెతకడం ఓ సమస్యగా మారింది. అలాంటి టైమ్ లో త్రిష ఈ సినిమా ఒప్పుకుంటే అంతకంటే వారికేం కావాలి. అందులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.













