మెగాస్టార్ సరసన త్రిష
కొన్నాళ్లుగా తమిళంలోనే అవకాశాలు అందుకొంటూ బిజీగా గడుపుతున్న త్రిష త్వరలో తెలుగు తెరపై సందడి చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆమె అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకొన్నట్టు తెలుగు సినీ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా ఇటీవలే ఒక చిత్రం ప్రారంభమైంది. అందులో ఇద్దరు నాయికలకి చోటుండబోతోందని తెలిసింది. పలువురు నాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, త్రిష ఎంపిక దాదాపు ఖాయమైందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి త్రిష సంతకం చేయనున్నారట. చిరు-త్రిష ఇదివరకు స్టాలిన్ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.













