మళ్ళీ ఊపందుకున్న త్రిష..
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెరంగేట్రం చేసిన త్రిష ఇప్పటికి ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. కెరీర్ పీక్స్ వెళ్లిన చెన్నై చిన్నది, ఆ స్టార్ ఇమేజ్ ని ఇంకా అలాగే కొనసాగిస్తుంది. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినట్టు అనిపించినా , త్వరలోనే పుంజుకుంది.
96 మూవీతో మరోసారి హిట్ కొట్టి తన సత్తా చాటిన త్రిష, ఆ మూవీ ఇచ్చిన జోష్ తో ముందుకి దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఊపందుకుంది. మరోవైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చెన్నై బ్యూటీ వదలట్లేదు.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా, తమిళంలో మాత్రం త్రిష తగ్గేదేలే అంటుంది. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్(ps1) మూవీలో కూడా త్రిష తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ని బీట్ చేసి మరీ త్రిష అందంగా కనిపించింది. ఈ మధ్య త్రిష మరింత మెరిసిపోతుంది.
ఈ అమ్మడి బ్యూటీ రహస్యం ఏమిటో కాని క్రేజ్ తోనే వరుస ఆఫర్లు అందుకుంటుంది. పీస్ 1 సినిమా స్పెషల్ డిస్కషన్స్ లో ఉన్న ఈ అమ్మడికి మరో ఆఫర్ తలుపు తిట్టిందట. తమిళ్ వర్సటైల్ హీరో దళపతి విజయ్ సరసన త్రిష కి నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
విజయ్ 67 మూవీగా వస్తున్న ఈ సినిమాని కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. విక్రమ్ తో సూపర్ క్రేజ్ ని సాధించిన కనగరాజ్ , ఇప్పుడు విజయ్ సినిమాని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి హీరోయిన్ గా త్రిష ని ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.
ఈ లేటెస్ట్ మూవీ లో ఛాన్స్ అందుకోవడం త్రిష కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. విజయ్ తో ఈ అమ్మడు 14 ఏళ్ళ క్రితం గిల్లి మూవీలో నటించింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ విజయతో త్రిష జతకట్టి ప్రేక్షకులని మెప్పించబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో త్రిష సెలెక్ట్ అవ్వడం నిజంగా అదృష్టం అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.













