నాకు సరైనోడు దొరకలేదు.. వాడి కోసమే ఎదురుచూస్తున్నా
టాలీవుడ్, కోలీవుడ్‌లో పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం ఈ భామ గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. ఈ అమ్మడు తాజాగా రజనీకాంత్‌తో పెట్ట సినిమాలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించినా కూడా త్రిషకు పెద్దగా క్రేజ్‌ను తీసుకురాలేకపోయింది. దీంతో ఈ అమ్మడి మనసు పెళ్లిపైకి మళ్లినట్లు అనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి జరగాల్సి ఉంది. వరుణ్ మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం కూడా అయింది. అయితే కారణం ఏంటో తెలియదు కాని వారి బంధం నిశ్చితార్థంతోనే ముగిసిపోయింది. పెళ్లి రద్దు కావడంతో మళ్లీ బిజీ అయ్యేందుకు త్రిష ప్రయత్నించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరోసారి పెళ్లి గురించి మాట్లాడింది. భారతీయ పెళ్లి సంప్రదాయాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కచ్చితంగా ప్రేమ వివాహం చేసుకుంటాను. ఇప్పటివరకు నా మనసుకు నచ్చిన వాడు, సరైనోడు దరొకలేదు. ఆ సరైనోడి కోసం ఎదురుచూస్తున్నాను అని త్రిష పేర్కొంది.













