పదేళ్లకు స్పందించిన త్రిష
కొన్ని సినిమాలు రిలీజై ఎన్నేళ్లు అవుతున్నా సరే అవి ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతాయి. వాటిలో 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒకటి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అప్పట్లో అంచనాలను మించి ఓ రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయినప్పటికీ వాటిలో వెంకీ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా మాత్రం స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఐదేళ్లకు అంటే 2013లో డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ మూవీకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు హీరోయిన్ త్రిష పదేళ్ల తర్వాత ఇప్పుడు స్పందించింది.
నేను రెడీగా ఉన్నాంటూ సెల్వ రాఘవన్ ట్వీట్ కు త్రిష రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై ఏదో అప్పుడే ఇచ్చి ఉంటే సీక్వెల్ వచ్చి కూడా పదేళ్లు అయుండేది కదా అని త్రిష ట్వీట్ కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడైనా ఈ కాంబోలో సీక్వెల్ చేయడానికి ఛాన్సుంది కానీ సరైన కథ ఉంటేనే అది వర్కవుట్ అవుతుంది. అలా కాకుండా ఈ మూవీని రీరిలీజ్‌కు అయినా ప్లాన్ చేసుకుంటే మంచి ఆదరణ దక్కే అవకాశముంది.













