త్రిషకు లక్కీ ఆఫర్
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ త్రిష. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగులో యంగ్ హీరోలతో పాటు చిరంజీవితో సహా అగ్ర హీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం తెలుగులో త్రిష హవా అంతగా లేదు కానీ తమిళంలో జోరు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కునున్న సినిమాలో త్రిష హీరోయిన్గా నటించనుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అంటే తెలుగులో త్రిష మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందన్న మాట. ఈ ప్రచారంపై అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అందాల తార త్రిష. ఇక తమిళంలో ఈ భామ చేస్తున్న ప్రాజెక్టులు అర డజనుకు పైగానే ఉండడం విశేషం.













