ఆ బాధ లేదు …. నా కల తీరింది
చిత్ర పరిశ్రమలో 16 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగడమంటే అంత సులభం కాదు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్గా రాణించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ త్రిష గత 16 ఏళ్లుగా హీరోయిన్గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించడం ఆమె కల. చివరికి త్రిష తన కలను నెరవేర్చుకుంటోంది. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. నేటి నుంచి ఏకాధాటిగా నెల రోజులపాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొనుంది. దీంతో త్రిష ఎంతో సంతోషంగా ఉంది. సిమ్రాన్ మరో హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, విజయ సేతుపతిలు కూడా నటిస్తున్నారు. అయితే త్రిష రోల్‌కు నెగటివ్ షేడ్స్ ఉంటాయని కోలీవుడ్ టాక్. ఇక విజయ్‌సేతుపతికి జంటగా త్రిష నటించిన 96 చిత్రం అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 1996లో విడిపోయిన ఇద్దరు స్కూల్‌మేట్స్ ఇప్పుడు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో సెన్సిటివ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.













