విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిష
పొన్నియన్ సెల్వన్ తో చెన్నై బ్యూటీ త్రిష ఎంత బిజీగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత పలు కొత్త ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే చిరూ, కమల్ లాంటి సీనియర్ హీరోల సరసన నటిస్తున్న త్రిష, తర్వాత తరం నటులతో కూడా కలిసి నటించేందుకు రెడీ అవుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నెపంతో త్రిష వచ్చిన ప్రతీ ఛాన్స్ ను అందుకుంటూ బిజీ అవుతుంది.
హీరోలతో తనకున్న ఫ్రెండ్షిప్ అవొచ్చు, తనకున్న టాలెంట్ కావొచ్చు, కారణమేదైనా కావొచ్చు. త్రిషకు ఛాన్సులు బాగా వస్తున్నాయి. తాజాగా అమ్మడు మరోసారి తన ఫ్రెండ్ విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో త్రిష కూడా ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే త్రిష హీరోయిన్ గా కాదు. ఓ కీలక పాత్ర కోసం త్రిషను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ రోల్ తో పాటూ స్పెషల్ సాంగ్ కూడా త్రిషతో చేయిస్తున్నారట. త్రిష క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సాంగ్ అంతా స్టోరీలో భాగంగానే ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా త్రిష పాల్గొనబోతుందట.













