ఆ వార్తల్లో నిజం లేదు : త్రిష
తాను ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటి త్రిష తేల్చి చెప్పారు. గతంలో త్రిష వరుణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి పీటల వరకు వెళ్లిన త్రిష పెళ్లి అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఆ తరువాత ఆమె సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలి కాలంలో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుదన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై త్రిష వివరణ ఇచ్చింది. తన మనస్సులో పెళ్లి ఆలోచన రాలేదని ఆమె సృష్టం చేసింది. డేటింగ్ తనకు నచ్చదని ఆమె పేర్కొంది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పలు తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.













