త్రిష లక్ మామూలుగా లేదుగా
భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి తన తర్వాతి సినిమాను వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటూ సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది.
చిరూ చాలా ఏళ్ల తర్వాత సోషియా ఫాంటసీ సినిమా చేస్తుండటంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారం అవుతుంది. ముగ్గురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.
యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు, విశ్వంభరలో త్రిష డ్యూయల్ రోల్ లో కనిపిచంనుందట. కథలో ఆమె పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. చిరూ సినిమాలో హీరోయిన్ గా నటించడమంటేనే లక్కీ ఛాన్స్. అలాంటిది ఏకంగా డ్యూయల్ రోల్ లో నటించి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కొట్టేయడమంటే త్రిష లక్ మామూలుగా లేదనే చెప్పాలి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.













