Triptii Dimri: స్పిరిట్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నా!

యానిమల్(Animal) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన త్రిప్తి డ్రిమ్రి(Triptii Dimri)కు ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లొచ్చాయి. ప్రస్తుతం త్రిప్తి పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ధడక్2(Dhadak2) సినిమా ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ధడక్2 ప్రమోషన్స్ లో త్రిప్తి తన రాబోయే సినిమా గురించి మాట్లాడింది.
విభిన్నమైన కథలు, పాత్రల్లో నటిస్తేనే నటిగా తర్వాతి స్థాయికి వెళ్లగలమని, టాలెంటెడ్ దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. కొత్త వ్యక్తులతో కలిసి వర్క్ చేయడం చాలా మంచి అనుభవాల్ని ఇస్తుందని, వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, ప్రస్తుతం తాను విశాల్ భరద్వాజ్(Vishal Bharadwaj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు త్రిప్తి తెలిపింది.
దాంతో పాటూ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్నానని త్రిప్తి(Triptii) తెలిపింది. స్పిరిట్ సినిమాను సందీప్ రెడ్డి వంగా చాలా గొప్పగా రూపొందిస్తున్నారని, ఆ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని త్రిప్తి తెలిపింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న స్పిరిట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా స్పిరిట్ లో ముందుగా దీపికా పదుకొణె(deepika Padukone)ను అనుకోగా తర్వాత ఆ ప్లేస్ లోకి త్రిప్తి వచ్చింది.