ఎట్టకేలకు యానిమల్ భామ ఒప్పేసుకుంది
యానిమల్ సినిమా ద్వారా రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న త్రిప్తి డిమ్రి కు ఆ సినిమా తర్వాత ఆఫర్ల వర్షం కురుస్తోంది. కానీ అమ్మడు మాత్రం తొందరపడకుండా ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ మిస్టర్ బచ్చన్లో తీసుకున్నారు కానీ అదంతా పుకారేనని సినిమా అనౌన్స్మెంట్ రోజు తేలిపోయింది.
త్రిప్తికి ఆఫర్లలో భాగంగా ఓ క్రేజీ సీక్వెల్ లో నటించే ఛాన్సొచ్చినట్లు తెలుస్తోంది. అమ్మడు ఆ క్రేజీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని టాక్. ఆషికి ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన మొదటి రెండు పార్టులు బాగా హిట్ అవడంతో ఆ సినిమాకు మూడో భాగం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా కార్య రూపం దాలుస్తున్నట్లు తెలుస్తోంది.
అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషికీ 3ని తెరకెక్కించబోతున్నాడు. యానిమల్ ను నిర్మించిన టీ సిరీస్ దీనికి కూడా నిర్మాణం వహించనుంది. ఆషీకి ఫ్రాంచైజ్ మీద అన్ని రైట్స్ ఉన్న టీ సిరీస్ ఆషీకి3ని భారీ బడ్జెట్తో నిర్మించనుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. 2024 ఏప్రిల్ లోగా షూటింగ్ మొదలుపెట్టి, 2025 సెకండాఫ్ లో సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.













