త్రిప్తి ఇకనైనా నేర్చుకోకపోతే కష్టమే!
వరుస పెట్టి క్రేజీ సీక్వెల్ సినిమాల్లో నటిస్తోంది త్రిప్తి డిమ్రీ. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీకి అవకాశాల పరంగా ఢోకా ఏమీ లేదు. యానిమల్ సక్సెస్ తర్వాత త్రిప్తిక బాగానే ఛాన్సులొస్తున్నాయి. ఇప్పటికే త్రిప్తి అర డజనుకు పైగా సినిమాలకు అడ్వాన్సులు తీసుకుంది.
ప్రస్తుతం ఆ సినిమాలన్నీ షూటింగుల్లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిప్తికి డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తో కలిసి నటించే గొప్ప ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకు విక్రమ్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నాడు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో త్రిప్తి తల్లిగా మాధురి కనిపించనుందని సమాచారం.
ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కు సెట్స్ పైకి వెళ్లి 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రిప్తీ వరుసగా గ్లామరస్ పాత్రలతోనే మెప్పిస్తోంది. యానిమల్ తర్వాత గుడ్ న్యూజ్ సినిమాలో కూడా అందాలు ఆరబోసే పాత్రే చేసింది. కొత్త సినిమా విక్కీ విద్యా కా వో వాలా ప్రోమోలో కూడా త్రిప్తి డ్యాన్స్ మూవ్స్ అడల్ట్ కంటెంట్ తో ఆశ్చర్యపరిచింది. అయితే త్రిప్తి ఎల్లకాలం ఇలాంటి పాత్రలు చేయడం వల్ల తన కెరీర్ పరగా ఏమీ ఉపయోగం ఉండదు. నటిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి త్రిప్తి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఇప్పటికైనా అది తెలుసుకోకపోతే భారీగా తన కెరీర్ ను నష్టపోవాల్సి ఉంది.













