త్రిప్తి రెమ్యూనరేషన్ అంతేనా?
యానిమల్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించినప్పటికీ రష్మిక కంటే ఆ సినిమా ద్వారా పాపులర్ అయింది మాత్రం త్రిప్తి డిమ్రీనే. సినిమా మొత్తం మీద త్రిప్తి కనిపించేది మహా అయితే 20నిమిషాలు. కానీ ఆ తక్కువ టైమ్ లోనే అమ్మడు చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. జోయా పాత్రలో త్రిప్తి కనబరచిన అందానికి, రణబీర్ తో అమ్మడు చేసిన ఇంటిమేట్ సీన్స్ ను యూత్ బాగా కనెక్ట్ అయింది.
యానిమల్ రిలీజ్ తర్వాత నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ఏదొక విధంగా ట్రెండ్ అవుతూన ఉంది. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే భూల్ భులయియా3 తో పాటూ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో త్రిప్తి ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న త్రిప్తి, యానిమల్ సినిమా కోసం అందుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ.
ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో కూడా ఆడియన్స్ కు తెలియదు. కొత్తమ్మాయి, పైగా రన్ టైమ్ తక్కువున్న పాత్ర కావడంతో తక్కువ రెమ్యూనరేషన్ అయినప్పటికీ యానిమల్ లో నటించేందుకు త్రిప్తి ఒప్పుకుంది. కానీ రిలీజ్ తర్వాత యానిమల్ సెన్సేషనల్ హిట్ అవడంతో త్రిప్తి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తోంది. మొత్తానికి యానిమల్ తర్వాత త్రిప్తి కెరీరే మారిపోయింది.













