Tripthi Dimri: త్రిప్తి కి డ్యామేజ్ చేస్తున్నదెవరు?
సినీ ప్రపంచమనేది వైకుంఠపాళి లాంటిది. ఈ ఆటలో ఎవరు బాగా ఆడగలరో ఎవరూ డిసైడ్ చేయలేరు. కొన్నిసార్లు కాలమే నిర్ణయిస్తుంది. టాలెంట్, లక్ కలిసొస్తే కొందరు స్టార్లు మంచిగా ఎదుగుతారు. అయితే ఎదిగేవాళ్లను కాళ్లు పట్టి లాగే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripthi Dimri) అలాంటి సిట్యుయేషనే ఫేస్ చేస్తోంది.
త్రిప్తి ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా యానిమల్(Animal) సినిమా తర్వాతే అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడం, ఆ సినిమాలో అమ్మడి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో యానిమల్ తర్వాత త్రిప్తికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వాటిలో కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
ప్రస్తుతం త్రిప్తి ఆషిఖి3(Aashiqui3), ధడక్2(Dhadak2) సినిమాల్లో నటిస్తోంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు మంచి హిట్ అయితే తన రేంజ్ మరింతగా పెరుగుతుంది. కానీ ఇంతలోనే ఈ బ్యూటీని అణిచేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారు. త్రిప్తి కెరీర్లో ఎదుగుతున్న టైమ్ లో ఆషిఖి3 నుంచి త్రిప్తి తప్పుకుందని ఓ పుకారుని పుట్టించారు. దీని వల్ల అమ్మడికి డ్యామేజ్ ఎక్కువగానే జరుగుతుంది. కానీ లక్కీగా డైరెక్టర్ అనురాగ్(Anurag Basu) దాన్ని ఖండించాడు. అయితే నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కొన్నిసార్లు ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్సుంది. మరి త్రిప్తి దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.













