Tripthi Dimri: బాలీవుడ్ నెం.1 ప్లేస్ లో త్రిప్తి
ఇండస్ట్రీలోకి ఎప్పుడొచ్చినా క్రేజ్ మాత్రం వచ్చే టైమ్ లోనే వస్తుంది. ప్రస్తుతం అలాంటి దశలోనే ఉంది త్రిప్తి డిమ్రి(Tripti Dimri). అమ్మడు యానిమల్ సినిమాకంటే ముందు నుంచే సినిమాలు చేస్తున్నప్పటికీ అవేవీ వర్కవుట్ అవలేదు. కానీ యానిమల్(Animal) తో అమ్మడు సెన్సేషన్ సృష్టించింది. యానిమల్(Animal) లో త్రిప్తి చేసిన పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎక్కువ.
ఆ సినిమా తర్వాత త్రిప్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో తనని ఎవరూ గుర్తించకపోయినా ఇప్పుడు మాత్రం తన ఐడెంటిటీ బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది త్రిప్తి మరో రేర్ ఫీట్ సాధించింది. నార్మల్ గా బాలవుడ్ లో ఉండే స్టార్స్ తాకిడికి వారిని తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది త్రిప్తి వారందరినీ దాటుకుని నెం.1గా నిలిచింది.
గూగుల్ సెర్చ్ లో త్రిప్తి మిగిలిన హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టేసి నెం.1 ప్లేస్ లో నిలిచింది. అయితే ఇదంతా యానిమల్ సినిమా ఎఫెక్టే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత త్రిప్తి నటించిన రెండు సినిమాలు కూడా ఆమె గ్లామర్ ను బాగానే వాడుకున్నాయి. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.













