క్రేజీ సీక్వెల్ యానిమల్ బ్యూటీ
90వ దశకంలో మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా మణిచిత్రతాళు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టోరీతోనే కన్నడలో ఆప్తమిత్ర తీశారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రజినీకాంత్ హీరోగా చంద్రముఖి పేరుతో రీమేక్ చేస్తే తెలుగు, తమిళ భాషల్లో రికార్డులు సృష్టించింది. ఇదే కథతో హిందీలో భూల్ భూలయియా అని రీమేక్ చేసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు అక్షయ్ కుమార్.
తర్వాత దానికి సీక్వెల్ గా భూల్ భూలయియా-2ను కార్తీక్ ఆర్యన్ హీరోగా తీశారు. ఆ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. అందులో కూడా కార్తీక్ ఆర్యనే హీరో. భూల్ భూలయియాలో ప్రధాన పాత్రలో నటించిన విద్యాబాలన్ ఈ సినిమాలో రీఎంట్రీ ఇస్తుంది.
దీంతో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. అంతేకాదు రీసెంట్ గా ఈ చిత్ర యూనిట్ లో మరో క్రేజీ భామ కూడా భాగమైంది. యానిమల్ సినిమాలో జోయా పాత్రతో అందరి మనసులు గెలుచుకున్న త్రిప్తి డిమ్రి భూల్ భూలయియా-3 లో నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













