పుష్పరాజ్ తో యానిమల్ బ్యూటీ స్పెషల్ సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప2. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని అందరూ ఎంతో టెన్షన్ లో ఉన్నారు. మరో వైపు పుష్ప2లో స్పెషల్ సాంగ్ కు హీరోయిన్ ను ఎప్పటినుంచో వెతుకుతుంటే దానికి పరిష్కారం ఇప్పుడు దొరికినట్లు తెలుస్తోంది.
యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్న త్రిప్తి డిమ్రిని తో ఈ స్పెషల్ సాంగ్ ను చేయించనున్నాడట సుకుమార్. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా ఈ స్పెషల్ సాంగ్ ను ఎవరితో చేయించాలా అని సుకుమార్ అనుకుంటున్నాడు.
దిశా పటానీని కూడా ట్రై చేశారు కానీ ఫైనల్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఆ ఛాన్స్ త్రిప్తి కి వచ్చినట్లు తెలుస్తోంది. మరి త్రిప్తి, పుష్ప1లో సమంత లా మ్యాజిక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. పుష్ప రిలీజ్ కు మరో 80 రోజులే టైముంది. ఈ లోపు పోస్ట్ ప్రొడక్షన్, రీరికార్డింగ్, సెన్సార్, ప్రమోషన్స్ అన్నీ చూసుకోవాలి. చూస్తుంటే పుష్ప2 ముందు చాలా పెద్ద టార్గెటే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ను మిస్ కాకూడదనే నేపథ్యంలో చిత్ర యూనిట్ రేయింబవళ్లు కష్టపడుతుంది.













