Tripthi Dimri: బాయ్‌ఫ్రెండ్‌కు త్రిప్తి బర్త్ డే విషెస్.. మళ్లీ పుట్టుకొస్తున్న డేటింగ్ వార్తలు
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన యానిమల్(Animal) సినిమాలో హీరోయిన్ రష్మిక(rashmika) కంటే ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది ఆ సినిమాలో కాసేపే నటించిన త్రిప్తి డిమ్రీ(Tripthi Dimri). యానిమల్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో త్రిప్తి వరుసగా సినిమా అవకాశాలందుకుంది. రీసెంట్ గా భూల్ భూలయ్యా3(Bhool Bhoolayya3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిప్తి ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా త్రిప్తి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ సామ్ మర్చంట్(Sam Merchant) కు బర్త్ డే విషెస్ తెలుపుతూ కొన్ని ఫోటోలతో పాటూ ఓ బ్యూటిఫుల్ కోట్ ను షేర్ చేసింది. త్రిప్తి షేర్ చేసిన ఫోటోల్లో త్రిప్తి, సామ్ ఇద్దరూ ఎంతో క్లోజ్ గా కనిపిస్తున్నారు. సన్ గ్లాసెస్ పెట్టుకుని నవ్వుతూ దిగిన సెల్ఫీ ఒకటి కాగా, సామ్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫోటో, ఎగ్జిబిషన్ లో ఉన్న సిల్వర్ జ్యుయలరీ వైపు చూపుతున్న ఫోటోతో పాటూ బర్త్ డే ట్రీట్ లోని ఫోటోలను కూడా త్రిప్తి షేర్ చేసింది.
ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే సామ్ మర్చంట్, నీ ప్రేమ, ఆనందం మళ్లీ నీకే తిరిగి వస్తుందని త్రిప్తి రాసింది. అయితే వీరిద్దరూ ఎంతోకాలంగా డేటింగ్ లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ విషయంలో త్రిప్తి కానీ, సామ్ కానీ ఇప్పటివరకు అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు త్రిప్తి షేర్ చేసిన ఫోటోలతో వీరిద్దరి డేటింగ్ వార్తలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి.













