టాక్సిక్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే!
కేజీఎఫ్ సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్. కేజీఎఫ్2 తర్వాత యష్ ఏ స్టార్ డైరెక్టర్ తోనో పనిచేస్తాడనుకుంటే అందరికీ షాకిస్తూ కమర్షియల్ సినిమాను హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. టాక్సిక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అందరూ అనుకునేంత ఆషామాషీగా ఉండదని యూనిట్ సభ్యులంటున్నారు.
కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా, తారా సుతారియా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 1950-1970 మధ్య గోవాలో జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో టాక్సిక్ రూపొందనుంది. హ్యూమా ఖురేషి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యష్ కు అక్కగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని డార్క్ విజువల్స్ ను టాక్సిక్ లో చూడబోతున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ ఊరిస్తోంది.
టాక్సిక్ లో యాక్షన్ సీన్స్ గూస్బంప్స్ తెప్తిస్తాయంటున్నారు. 200 రోజుల షూటింగ్ కు సరిపోయే షెడ్యూల్స్ ను ఇప్పటికే ప్లాన్ చేశారట. గోవాలో కొంత భాగం, ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి రానున్న టాక్సిక్ హిట్ అవడం యష్ కు ఎంతో ముఖ్యం. మరి ఈ సినిమా అతని ఆశల్ని ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.













