లండన్లో యష్, నయన్ల పోరాటం
కేజీఎఫ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అయ్యాక హీరో యష్ ఎంతో గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమా టాక్సిక్ను గీతూ మోహన్ దాస్ తో చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ముప్పాతిక శాతం షూటింగ్ లండన్ లోనే ఉండనుందట. మొత్తం 200 రోజుల షూటింగ్ లో 150 రోజులు అక్కడే ప్లాన్ చేశారట. టాక్సిక్ లో హీరోకు సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా భాగం కానుందని సమాచారం. గోవా డ్రగ్స్ నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ డ్రామాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందోని సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం డ్రగ్స్ తో వ్యాపారం చేసే ముఠాతో యష్, నయన్ కలిసి చేసే పోరాటం ఆధారంగా ఇది డిఫరెంట్ గా తెరకెక్కుతున్న తెలుస్తోంది. దీని కోసం యష్ గన్ షూటింగ్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ ను మించిన యాక్షన్ సీన్స్ టాక్సిక్ లో ఉండనున్నాయట. వచ్చే ఏడాది ఏప్రిల్ కు సినిమాను రిలీజ్ చేయలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు కానీ అప్పటికి పూర్తవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఈ సినిమా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.













