‘టచ్ చేసి చూడు’ టీజర్ విడుదల
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. రాశీఖన్నా కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చిపారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లాద్దాలు తీసి స్టైల్‌గా రవితేజ నడిచి వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు.













