గుంటూరు కారం టీమ్ కు టూ మచ్ ప్రెజర్
మరో 20 రోజుల్లో రిలీజ్ కానున్న గుంటూరు కారం షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12 అంటే ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా కోసం శ్రీలీల తన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ సైతం వదులుకుని షూటింగ్ లో పాల్గొంటుంది. ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే వారం గ్యాప్ తీసుకోవాలి. ఆ గ్యాప్ వస్తే గుంటూరు కారం రిలీజ్ పోస్ట్‌పోన్ అవడం ఖాయం.
అందుకే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలని డిసైడైందట. ఈ సినిమాలోని ఓ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ను ప్రస్తుతం చేస్తున్నారు. ఓ వైపు షూటింగ్ జరుగుతున్న గుంటూరు కారం టీమ్ ముందు చాలా కార్యాలున్నాయి. అతి తక్కువ టైమ్ లో ఎన్నో పనులు చేయాల్సి ఉంది. ట్రైలర్ కట్ చేయాలి. లిరికల్ వీడియోలు రెడీ చేసుకోవాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలతో పాటూ చివరి వారంలో ఫైనల్ రీరికార్డింగ్, సెన్సార్, ఓవర్సీస్ కు హార్డ్ డిస్క్ పంపండం లాంటివి చాలానే ఉంటాయి. వీటన్నింటినీ చూసుకుంటే గుంటూరు కారం చేతిలో ఉంది గట్టిగా రెండు వారాలే. ఎంత టైట్ షెడ్యూల్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు కారం చెప్పినట్టు జనవరి 12కి రిలీజ్ కావాల్సిందే. లేదంటే బయట ఆడియన్స్ కంటే ఫ్యాన్సే మేకర్స్ కు ఊపిరాడకుండా చేసేలా ఉన్నారు.













