మాస్ సినిమాల్లో ఏది విన్నర్‌గా నిలుస్తుందో?
రానున్న రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ నెలకొంది. ఈ రెండు రోజులు రిలీజ్ కాబోతున్న సినిమాలు మాస్ ని టార్గెట్ చేసుకున్నవే. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది స్కంద మూవీ గురించి. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆశపడుతున్నారు.
సినిమా మొదటి ట్రైలర్ స్కందపై అనుమానులు రేకెత్తించినా, రెండో ట్రైలర్ తో దాన్ని సెట్ చేశారు. ఏదేమైనా సినిమా బాగుందనే టాక్ వస్తేనే కలెక్షన్స్ వస్తాయి. ఇక రెండో సినిమా చంద్రముఖి2. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని, సినిమా కచ్ఛితంగా హిట్ అవుతుందని టీమ్ చాలా ధీమాగా చెప్తున్నారు.
ఇక మూడో సినిమా పెదకాపు1. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూశాక ఆడియన్స్ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాలు కూడా మాస్ సినిమాలే. వీటిలో ఏ సినిమా మాస్ ను బాగా మెప్పిస్తే అదే ఈ వీక్ విన్నర్ గా నిలుస్తుంది.













