మెగా ఫోన్ పట్టనున్న విలన్
ఈ మధ్య కమెడియన్స్, కొరియోగ్రఫర్స్, సినిమాటోగ్రఫర్స్, యాక్టర్స్ అందరూ తమలోని దర్శకులను బయటపెట్టాలని చూస్తున్నారు. కమెడియన్ వేణు యెల్దండి బలగం సినిమా కోసం మొదటి సారి మెగా ఫోన్ పట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇటీవలే ధనరాజ్ కూడా రామం రాఘవం అనే సినిమాను డైరెక్టర్ గా మొదలుపెట్టాడు. రీసెంట్ గా కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీ నా సామిరంగతో హిట్ అందుకున్నాడు. సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజతో ఈగల్ సినిమాను తీసి రిలీజ్ కు రెడీ గా ఉన్నాడు.
ఇప్పుడు మరో నటుడు కూడా మెగాఫోన్ పట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ గా ఎన్నో సినిమాలు చేసి, ఛత్రపతిలో కాట్రాజుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత్ గత కొంతకాలంగా సినిమాల్లో నటించడం తగ్గించాడు. దానికి కారణం సుప్రీత్ డైరెక్టర్ గా తన లక్ ను టెస్ట్ చేసుకోవాలనుకోవడమేనని తెలుస్తోంది.
గత రెండ్రోజులుగా ఈ విషయమై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. అలాగని సుప్రీత్ కొత్త హీరోతో డెబ్యూ చేయడం లేదు. ఏకంగా నేచురల్ స్టార్ నానికి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ లేదా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమా ను నిర్మించనుందని టాక్. ప్రస్తుతం వివేక ఆత్రేయతో సరిపోదా శనివారం చేస్తున్న నాని, ఆ సినిమాను సమ్మర్ లోపు పూర్తి చేయనున్నాడట. ఈ లోగా మరో రెండు సినిమాలను లాక్ చేయాలనుకుంటున్నాడు నాని. కాగా నాని తో సినిమా చేయడానికి బలగం వేణు, శ్రీకాంత్ ఓదెల కూడా లైన్ లో ఉన్నారు. మరి వీరందరిలో నాని ఎవరితో ముందు సినిమా చేస్తాడో చూడాలి.













