దసరా వరకు సినిమాల పండగే!
సినీ ఇండస్ట్రీలో ఏడాదికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా అనుకోని రీతిలో కలెక్షన్లు కురిపించి, మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటాయి. అలా ఈ ఇయర్ లో చిన్న సినిమాలైన బలగం, బేబీ, సామజవరగమన లాంటి సినిమాలు మంచి టాక్‌తో సూపర్బ్ కలెక్షన్స్ ను అందుకున్నాయి.
ఇదిలా ఉంటే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఏజెంట్, శాకుంతలం, భోళా శంకర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్ ని బట్టి కాదు కంటెంట్ ని బట్టి సినిమా ఫలితం ఉంటుందనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి మొదలు దసరా వరకు చాలానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
సెప్టెంబర్ 28న రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న స్కంద రిలీజ్ కాబోతుంది. అలాగే లారెన్స్ హీరోగా వస్తున్న డబ్బింగ్ సినిమా చంద్రముఖి2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 29న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న పెదకాపు 1 రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
అక్టోబర్ 6న కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్‌తో పాటూ మంత్ ఆఫ్ మందు మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత దసరా కానుకగా అక్టోబర్ 19న బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు విజయ్-లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న లియో రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజు రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కు రెడీ అయింది. ఇన్ని వరుస సినిమాల్లో ఏవి బాక్సాఫీస్ వద్ద నిలబడతాయో చూడాలి.













