దక్షిణాఫ్రికాలో తెలుగు స్టార్స్ క్రికెట్
హైదరాబాద్ తల్వార్స్, టిసిఎ (తెలుగు సినిమా అకాడమీ) టీమ్‌లు కలిసి ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో మన తెలుగు స్టార్స్ దక్షిణాఫ్రికాలో ఉన్న తెలుగు వాళ్లతో కలిసి క్రికెట్ ఆడబోతున్నారు. మే 17, 18న క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. క్యాన్సర్ బాధితుల సహాయార్థం తెలుగు స్టార్స్ క్రికెట్ ఆడతారు. ఈ మ్యాచ్‌ల వల్ల వచ్చే డబ్బును ఆఫ్రికాలో ఉన్న చైల్డ్‌హుడ్ క్యాన్సర్ అసోసియేషన్‌కు అందిస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక మంచి పని కోసం మేము దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడబోతున్నాం. దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడడం ఓ సరికొత్త అనుభవం. అక్కడ ఉన్న భారతీయులతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడబోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్, అల్లరి నరేష్, సునీల్, నిఖిల్, సాయి ధరమ్ తేజ్, అభినవ్ సర్దార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.













