ఉత్తమ హీరోహీరోయిన్లుగా నాని, సమంత
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డస్లో నాని, సమంత ఉత్తమ నటీనటులుగా నిలిచారు. కరోనా వ్యాప్తితో ముంబాయిలో నిర్వహించాల్సిన క్రికెట్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డస్ వేడుక వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ వేడుక ఈ నెల 14న నిర్వహించాల్సి ఉంది. తాజాగా తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, గు•రాతీ భాషల్లో విజేతలను ఫేస్బుక్, యూట్యూబ్ వేదికగా ప్రకటించారు. తెలుగులో నాని, సమంత అత్యుత్తమ అవార్డులు గెలుచుకున్నారు. జెర్సీ చిత్రంలో నటనకుగానూ నానికి ఉత్తమ హీరోగా నిలిచాడు. ఓ బేబీలో సమంత నటన క్రిటిక్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డస్ జ్యూరీని మెప్పించింది. దీంతో ఆమెను ఉత్తమ నటిగా ఎంపిక చేశారు.













