న్యూ ఇయర్‌కు విదేశాలకు చెక్కేస్తున్న టాలీవుడ్ స్టార్స్
2023 దాదాపుగా పూర్తైపోయింది. 2024 న్యూ ఇయర్ వేడుకలు మొదలు కాబోతున్నాయి. సెలబ్రిటీలు ఇప్పటికే విదేశాలకు చెక్కేస్తున్నారు. స్టార్స్ అయితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత మళ్లీ తిరిగి ఇండియాకు రానున్నాడు తారక్.
ఇక గుంటూరు కారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ వేడుకల కోసం న్యూ యార్క్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మహేష్ కొడుకు గౌతమ్ న్యూ యార్క్ లో చదువుతుండటంతో ఫ్యామిలీ మొత్తం అక్కడకు వెళ్లి న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. నమ్రత, సితార ఇప్పటికే న్యూయార్క్ వెళ్లారు. గుంటూరు కారం షూటింగ్‌ను పూర్తి చేసుకుని మహేష్ కూడా వెళ్లనున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే దుబాయ్ వెళ్లాడు. ఈ వీకెండ్ మొత్తం అక్కడే ఉండి, ఆ తర్వాత తిరిగి ఇండియాకు రానున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ యూఎస్‌లో ఉన్నాడు. తన న్యూ ఇయర్ ను రౌడీ హీరో అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన స్టార్లు కూడా తమ సెలబ్రేషన్స్ ను రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు.













