బిజినెస్ మేన్ కు జీఎస్టీ షాక్!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. వస్తు, సేవల పన్ను చెల్లించనందుకు ఆయన బ్యాంక్ ఖాతాలను జప్తు చేస్తూ హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో మహేశ్‌బాబు 2007-08 సంవత్సరంలో చేసిన వాణిజ్య ప్రకటనలకు సంబంధించి రూ.18.5 లక్షల సేవాపన్ను చెల్లించాల్సి ఉన్నదని, ఈ విషయమై నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో ఆయనకు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల్లోని రూ.73.5 లక్షలను పన్నుతోపాటు వడ్డీ, పెనాల్టీ కింద జప్తు చేశామని హైదారబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.













