Sravana bhargavi: విడాకుల బాటలో టాలీవుడ్ సింగర్స్..?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు జంటలు విడిపోగా, ఇప్పుడు మరో జంట విడిపోవడానికి రెడీగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వాళ్లు మరెవరో కాదు, స్టార్ సింగర్లుగా తమ సాంగ్స్ తో తెలుగు ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ ను దక్కించుకున్న శ్రావణ భార్గవి(sravana bhargavi), హేమ చంద్ర(hema chandra).
వీరిద్దరూ మంచి సింగర్లు. ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉండటం వల్ల ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికొక పాప కూడా. వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని గత కొన్నాళ్ల నుంచే వార్తలొస్తున్నాయి. ఇద్దరికీ అసలు పడటం లేదని, అందుకే ఎవరికి వారు వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.
అయితే విడాకుల గురించి బయట ఎన్ని వార్తలొస్తున్నా వారిద్దరూ పట్టించుకోకపోవడంతో వాటికి ఆజ్యం పోసినట్టైంది. దానికి తోడు రీసెంట్ గా దీపావళి సందర్భంగా శ్రావణ భార్గవి ఇన్‌స్టాలో ఓ అమ్మ, ఓ నాన్న, ఓ అక్క, ఓ తమ్ముడు అది స్టోరీ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోల్లో హేమచంద్ర లేకపోవడం గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తల్ని నిజమని నమ్మేలా చేస్తోంది. మరి ఇప్పటికైనా ఈ జంట విడాకుల విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
https://www.instagram.com/p/DQEgd5Pgfx6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==