సింగర్ సునీత పెళ్లి ముహూర్తం ఖరారు!
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత పెళ్లి తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటిల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి జనవరి 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల ముందే హైదరాబాద్లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్ యూనిట్కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.













