రూటు మార్చిన టాలీవుడ్ డైరెక్టర్లు
ఈ మధ్య డైరెక్టర్లందరూ తమ ఫార్ములా మార్చినట్లు కనిపిస్తోంది. సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఎప్పుడూ హింసను చూపించడు. కానీ ధనుష్ తో శేఖర్ కమ్ముల చేయబోయే సినిమాలో హీరోతో బాంబులు, కత్తులు, తుపాకులు పట్టించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే మాఫియా స్టోరీ శేఖర్ కమ్ముల నుంచి ఎవరూ ఊహించరు.
కొరటాల శివ కూడా సెన్సిబుల్ స్టోరీతో సినిమాలు చేస్తూ అందులో తనదైన యాక్షన్ మార్క్ చూపిస్తుంటాడు. కానీ ఈసారి దేవర కోసం కొరటాల కూడా రూట్ మార్చి కొత్త జానర్లోకి ప్రవేశించి, దేవరలో నెక్ట్స్ లెవెల్ యాక్షన్ ను ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఇక అనిల్ రావిపూడి కామెడీ కి పెద్ద పీట వేస్తూ సినిమాలు చేసేవాడు.
కానీ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరిలో ఓ సెన్సిబుల్ టాపిక్ ను టచ్ చేసి సక్సెస్ అందుకున్నాడు. సుకుమార్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఒకప్పుడు ఈ లెక్కల మాస్టారు తన సినిమాలో చెప్పే లాజిక్స్ అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ కనీసం రెండు సార్లు సినిమా చూడాల్సి వచ్చేది. కానీ పుష్పతో కొత్త బ్యాక్ డ్రాప్ లో కథను సెలెక్ట్ చేసుకుని మంచి హిట్ అందుకున్నాడు. పుష్పకు వచ్చిన క్రేజ్ వల్ల పుష్ప2 మరింత గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ రకంగా మన డైరెక్టర్లు తమ సక్సెస్ ఫార్ములాను పక్కనపెట్టి కొత్త జానర్లలో ఆడియన్స్ ను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు.













