టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్
ఒకప్పుడంటే సముద్రం నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చేవి కానీ గత కొన్నేళ్లలో ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం తగ్గాయి. దీంతో టాలీవుడ్ హీరోలకు ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలు చేయాలని మనసు లాగుతుంది. దానికి ఉదాహరణే ఆయా హీరోలు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు, వాటి తాలూకా కథలు. ప్రస్తుతం ఎన్టీఆర్, నాగచైతన్య ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో సముద్రపు అలల మీద జరిగే రక్తపాతంతో కొరటాల శివ ఎన్టీఆర్ ను ఆవిష్కరిస్తుండగా, మరోవైపు నాగచైతన్య తండేల్ అంటూ డిఫరెంట్ ప్రేమ కథతో యాక్షన్, థ్రిల్ ను కలిపి చందూ మొండేటి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ నేపథ్యంలో గతేడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కూడా మంచి హిట్ గా నిలిచింది. వైష్ణవ్ తేజ డెబ్యూ సినిమా ఉప్పెన ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చి నేషనల్ అవార్డు కొట్టేసింది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే పడవ, సముద్రం అనేవి టాలీవుడ్ హీరోలకు సెంటిమెంట్ గా మారతాయేమో అనిపిస్తుంది.













