ఈసారి సంక్రాంతికి సినిమాల పండగే!
ఇంకా 5నెలల టైమ్ ఉండగానే ఇప్పటినుంచే సంక్రాంతికి సినిమాలు క్యూ కడుతున్నాయి. సంక్రాంతి సీజన్ అంటే చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ఈ సీజన్‌కు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ కావడంతో పెద్ద మొత్తంలో సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే తమ డేట్స్ ను లాక్ చేసుకుంటున్నాయి సినిమాలు.
ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలను చూసుకుంటే అందులో మొదటిగా రవితేజ ఈగల్ మూవీ ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది కాకుండా ప్రశాంత వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్నట్లు రీసెంట్గా అనౌన్స్ చేశారు.
కాగా ఇప్పుడు సంక్రాంతి రేసులోకి మరో సినిమా కూడా వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న పరశురామ్- విజయ్ దేవరకొండ మూవీ కూడా సంక్రాంతికే రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇయర్ వారసుడు మూవీతో సంక్రాంతికి హిట్ అందుకున్న దిల్ రాజు వచ్చే ఏడాదికి విజయ్ దేవరకొండ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇది కాకుండా మెగాస్టార్-కళ్యాణ్ కృష్ణ కాంబోలో సుస్మిత నిర్మించనున్న మూవీని కూడా సంక్రాంతి బరిలోకే దింపాలని చూస్తున్నారట. ఇప్పటివరకు ఈ సినిమాలు సంక్రాంతి బరి టాక్స్ లో ఉండగా, టైమ్ దగ్గరపడే కొద్దీ మరిన్ని సినిమాలు రేసులోకి వచ్చే అవకాశముంది. ఫైనల్ గా ఏ సినిమాలు వచ్చే ఏడాది పండగ రేసులో నిలుస్తాయో చూడాలి.













