ఈ సారి 2024 సంక్రాంతి చప్పగా!!!
సంక్రాంతి వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కి నిజమైన పండుగ వచ్చినట్లే. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం ప్రేక్షకులని నిరాశ పరిచేటట్లే అనిపిస్తుంది. సంక్రాంతి రిలీజ్ల కోసం ప్రేక్షకులతో పాటు హీరోలు, నిర్మాతలు ఎంతగా ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి ఎవరు పోటీలో ఉంటారంటే ఆ సమయం వరకు వేచి చూడాల్సిందే. గతంలోనే ‘ప్రాజెక్ట్ కె ‘ మూవీని జనవరి 12 న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదట. కాబట్టి ఈ మూవీ సంక్రాంతి కానుకగా వస్తుందన్న గ్యారంటీ లేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ వచ్చే ఛాన్స్ లేదని క్లియర్ గా తెలుస్తూనే ఉంది. దీనికి కారణం ఈ ప్రాజెక్టులోని మార్పులే. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాడు. ఏదేమైనా ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉంటుందో లేదో రేపు సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఏదొక అప్డేట్ ఇస్తే తప్ప ఒక స్పష్టత రాదు. ఇక మెగాస్టార్ చిరంజీవి ,కళ్యాణ్ కృష్ణల సినిమా సంక్రాంతికి రిలీజ్ అనుకొన్నారు. ఈ సినిమా షూటింగ్ నే మొదలు కాలేదు.
ఇక పక్కా ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే అది మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్ ‘ అనే చెప్పాలి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ మూవీతో పాటు చిన్న హీరో అయిన తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘హనుమాన్’ ఈ మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిన్న హీరో సినిమా అయినా ఆశలు మాత్రం ఆ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఉన్నాయని చెప్పాలి.
మరి ఈ రెండు సినిమాలేనా లేక వేరే ఏమైనా సినిమాలు ఉన్నాయా లేదా అనేది పండుగకి రెండు నెలల ముందే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ క్లారిటీ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.













