ఈ దసరా ప్రేక్షకులకు పండగే..
టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ఫుల్ మీల్స్ అందించేది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఆ టైమ్ లో ఎక్కువ సంఖ్యలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ బావుంటే అన్ని సినిమాలూ బాగా ఆడతాయి కూడా. ఒకేసారి రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి హిట్స్ అయిన సందర్భాలున్నాయి. సంక్రాంతి తర్వాత ఉన్న సీజన్ అంటే దసరానే. సంక్రాంతి అంత పోటీ లేకపోయినా అప్పుడు కూడా సినిమాలు బాగానే రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి సంక్రాంతికి మూడు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ఆ మూడు సినిమాలకూ మంచి క్రేజ్ ఉంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
బాలయ్యకు పోటీగా రానున్న మరో సినిమా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు కూడా హైప్ బాగానే ఉంది. రీసెంట్గా వచ్చిన టీజర్ సినిమా స్థాయిని, సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి పెంచాయి. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని బాగానే ఇంప్రెస్ చేసేలా అనిపిస్తుంది. వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.
ఇక ఈ రెండు సినిమాలతో పాటూ దసరాకు రిలీజ్ కానున్న మరో చిత్రం లియో. ఈ సినిమా డబ్బింగ్ మూవీ అయినప్పటికీ విజయ్ హీరో కావడం, దానికి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూస్తుంటే ఈ మూడు సినిమాలూ మంచి సినిమాలయ్యేలానే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ దసరా సీజన్‌కు తెలుగు ప్రేక్షకులకు నిజమైన పండగనే చెప్పాలి.













