సెప్టెంబర్‌ను టార్గెట్ చేసిన పెద్ద సినిమాలు
ఈ సెప్టెంబరులో బాక్సాఫీస్ షేక్ కాబోతుంది. ఒకటి రెండూ కాదు నాలుగు పెద్ద సినిమాలు ఈసారి సెప్టెంబరును టార్గెట్ చేశాయి. ఈ మూవీస్‌లో ఏ మూవీ హిట్టయినా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి సెప్టెంబరులో ఏయే మూవీస్ రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయో చూద్దాం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ క్వీన్ సమంత కాంబోలో వస్తున్న ప్రేమ కథా చిత్రం ఖుషి సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ దగ్గర నుంచే మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇది కాకుండా అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మూవీ కూడా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. వీరిద్దరి కాంబోనే చాలా క్రేజీగా అనిపిస్తున్న నేపథ్యంలో ఈ కాంబోలో వచ్చే మూవీపై ప్రేక్షకుల్లో చాలానే అంచనాలున్నాయి. NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కాకుండా ప్రభాస్ మూవీ సలార్ కూడా సెప్టెంబర్‌నే టార్గెట్ చేసింది. కెజిఎఫ్ తో పాన్ ఇండియన్ లెవల్లో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్28న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి వీటన్నింటిలో ఏ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో చూడాలి.













