September Releases: క్రేజీ సినిమాలతో ముస్తాబైన సెప్టెంబర్
వార్2(war2), కూలీ(Coolie) సినిమాలు భారీ హిట్లు గా నిలిచి, రికార్డులు సృష్టించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయనుకుంటే ఆ రెండు సినిమాలూ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఇక ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ రిలీజులపై పడింది. అందులో భాగంగానే సెప్టెంబర్ లో పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 5న ఘాటీ(Ghaati), మిరాయ్(Mirai) సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొనగా, ఆ తర్వాత వారం సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda sreenivas) కిష్కింధపురి(Kishkindhapuri) రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 19న విజయ్ ఆంటోనీ(Vijay anthony) డబ్బింగ్ మూవీ భద్రకాళి(bhadrakali) రిలీజ్ కానుంది. ఇక సెప్టెంబర్ 25న ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.
అవే అఖండ2(akhanda2), ఓజి(OG). బాలయ్య బాబు(balayya babu) హీరోగా బోయపాటి(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ2(Akhanda2) సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, పవన్(pawan)- సుజిత్(sujeeth) కాంబినేషన్ లో రాబోతున్న ఓజిపై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఈ రెండింటిలో ఓజి సినిమా రావడం పక్కా అని ఇప్పటికే క్లారిటీ రాగా, అఖండ2 వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా సెప్టెంబర్ లో మాత్రం ప్రతీ వారం ఓ కొత్త మూవీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. మరి వాటిలో ఏ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.







