కళకళలాడుతున్న థియేటర్లు
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. సంవత్సరంలో వచ్చిన సినిమాల మొత్తంలో వాటి రిజల్ట్ ను బట్టి చూస్తే హిట్ సినిమాలు 10% కంటే ఎక్కువ ఉండవు. ఈ ఇయర్ ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు లేక మొదటి ఆరు నెలలు నిరాశాజనకంగా గడిచాయి. హను మాన్(Hanu Man), టిల్లూ స్వ్కేర్(Tillu Square) మినహా థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు లేవు.
సెకండాఫ్ లో వచ్చిన కల్కి(Kalki) సినిమా అందరికీ మంచి ఉపశమనాన్ని అందించింది. దాని తర్వాత రెగ్యులర్ గా ఏదోక సినిమా థియేటర్లకు సందడిని తీసుకొస్తూనే ఉంది. ఆగస్ట్ 9న వచ్చిన కమిటీ కుర్రాళ్లు(Committee Kurrollu) మంచి కంటెంట్ తో ప్రేక్షుల్ని మెప్పించగా, తర్వాత ఇండిపెండెన్స్ వీక్ లో వచ్చిన ఆయ్(AAY) మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
అదే నెలాఖరున వచ్చిన సరిపోదా శనివారం(Saripoda Sanivaram) వర్షాలను తట్టుకుని మరీ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత 35: చిన్న కథ కాదు(35: Chinna Katha kadhu) సినిమా కూడా బాగానే ఆడింది. వారం తర్వాత వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ సెప్టెంబర్ నెలాఖరున వచ్చిన దేవర1(Devara1) ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దసరా సెలవులు రావడంతో సెకండ్ వీక్ లో కూడా దేవర తన రన్ ను కొనసాగిస్తోంది. ఈ వారం రానున్న శ్వాగ్(Swag) పై టీమ్ ఎంతో నమ్మకంగా ఉంది. దీని తర్వాత దసరా సినిమాల హంగామా మొదలుకానుంది. మొత్తానికి ఈ ఇయర్ సెకండాఫ్ లో మాత్రం థియేటర్ల పరిస్థితి బాగుందనే చెప్పాలి.













