అభిమానుల ఆజ్ఞ….శిరసావహించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ హీరోలు!
ఒక హీరో సక్సెస్‌లు సాధించి విజయపథంలో నడవాలంటే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉండాలి. ఆ హీరో చేసే సినిమాలు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉండాలి. కొన్ని సక్సెస్‌ల తర్వాత హీరోలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథలు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకప్పుడు హీరోలకు, అభిమానులకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. హీరోలు ఎక్కడ ఉన్నా డైరెక్ట్‌గా వారిని కలిసి మాట్లాడేంత చనువు ఉండేది. హీరోలు కూడా తమ సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు. ఇంకా తన నుంచి ఎలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు వంటి విషయాల గురించి అభిమానులతో చర్చించేవారు. కొన్ని సినిమాలు అభిమానుల కోసం వారు కోరిన విధంగా చేసేందుకు కూడా హీరోలు వెనకాడేవారు కాదు.
అయితే ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పడూ ఏదో ఒక అసంతృప్తి అనేది ఉండనే ఉంటుంది. ఎంత మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేసినా, ఎంత కష్టపడి చేసినా ఏదో ఒక వెలితి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా అభిమానుల్లో ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తమ అభిమాన హీరోని వారు ఎలా చూడాలనుకుంటున్నారో ఒక ఇమాజినేషన్ ఉంటుంది. దాన్ని రీచ్ అయితే వాళ్ళు హ్యాపీ. అయితే ఈమధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి మారింది. సినిమాటిక్‌గా ఉండే కథల కంటే నేచురల్‌గా ఉండే కథలు, యదార్థ ఘటనలతో కూడిన కథలంటే ఇష్టపడుతున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలంటే ప్రేక్షకులకు మొహం మొత్తినట్టుగా అనిపిస్తోంది. సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి హీరోలను కలిసి తమ అభిరుచుల్ని చెప్పేవారు అభిమానులు. ఇప్పుడు సోషల్ మీడియాతో హీరోలతో ప్రేక్షకులకు, అభిమానులకు సాన్నిహిత్యం పెరిగింది.
తమకి ఎలాంటి సినిమాలు కావాలో సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. తమకు ఎలాంటి సినిమాలు కావాలి, తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారు అనే అంశాలను హీరో దృష్టికి తీసుకొస్తున్నారు. మరికొంతమంది తమ హీరోను డిమాండ్ చేసి మరీ అడుగుతున్నారు. లాక్డౌన్ పుణ్యమా అని అభిమానుల్ని సోషల్ మీడియాలో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రేక్షకులు, అభిమానులు తమను తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక కాంటెస్ట్ వంటిది పెట్టబోతున్నారు. మహేష్ తాజాగా సర్కారువారి పాట చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉండాలి, సినిమా ఎలా ఉంటే హిట్ అవుతుంది, హీరోయిన్ ఎవరైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు వంటి విషయాలను డిస్కస్ చేస్తారు. ఒకప్పుడు తమకు ఇలాంటి సినిమా కావాలి అని హీరోలను రిక్వెస్ట్ చేసేవారు. ఇప్పుడా స్థానంలో హీరోలను డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మన హీరోలు కొత్త తరహా సినిమాలు చేయడానికి ముందుకు రావడంలో అభిమానుల కృషి కూడా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.













