నవీన్ ను చూసి కుళ్లుకుంటున్న హీరోలు
రెండు సినిమాలతోనే పెద్ద స్టార్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో తన ప్లేస్ ను ఫిక్స్ చేసుకున్నాడు ఈ ఏజెంట్. ప్రెజెంట్ ఎక్కడ విన్నా నవీన్ గురించే చర్చే నడుస్తుంది. తన సినిమా గురించి కంటే ఎక్కువగా తన నటన, కామెడీ టైమింగ్ గురించే ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారు.
అయితే తర్వాత నవీన్ చేయబోతున్న సినిమా ఏంటనే దాని గురించి ఆరా తీయడం ఎక్కువైంది. యువీ క్రియేషన్స్ లో ఇప్పటికే సినిమా ఫిక్స్ అయింది. ఇందులో అనుష్క హీరోయిన్. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా సరే ఈ సినిమాలో నవీన్ యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లోనే కనిపిస్తారని తెలుస్తుంది. 40 ఏళ్ల నడి వయస్కురాలితో ప్రేమలో పడే 20 ఏళ్ల కుర్రాడిగా నవీన్ కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. నిశ్శబ్ధం తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్న అనుష్క మరోసారి తనదైన నటన, హావభావాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోనున్నారని అందరూ భావిస్తున్నారు. ఈ విషయం పక్కన పెట్టి అసలు విషయానికొస్తే.. నవీన్ జాక్ పాట్ పట్ల సాటి హీరోలు కుళ్లుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క పక్కన నటించాలని చాలా కాలంగా సినిమాలు తీస్తున్న హీరోలకు కూడా ఆ కల నెరవేరకపోవడం.. అలాంటిది కేవలం రెండు సినిమాలకే నవీన్ కు ఆ ఛాన్స్ రావడంతో మిగిలిన హీరోలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. సున్నితమైన ఉద్వేగాల్ని పలికిస్తూ చక్కని టైమింగ్ తో కామెడీ పండిస్తూ ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో భాగమవడం సినిమాకు చాలా పెద్ద ఎస్సెట్ కానుంది.













