Tollywood Heroes: సమ్మర్ లో షూటింగులకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్లు
తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తెలుగులో వచ్చే భారీ సినిమాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు భారీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్టార్ హీరోల క్రేజ్, మార్కెట్ తో పాటూ తెలుగు సినిమా స్థాయి పెరగడంతో మేకర్స్ వాటిని చాలా భారీగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న భారీ సినిమాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేస్తున్న ఓజి(OG), హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu), మహేష్(Mahesh) ఎస్ఎస్ఎంబీ29(SSMB29), ప్రభాస్(Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్(The Raja Saab), ఫౌజి(Fouji), ఎన్టీఆర్(NTR) డ్రాగన్(Dragon) తో పాటూ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది కూడా ఉన్నాయి. అయితే వారిలో ఎన్టీఆర్ తప్ప మిగిలిన హీరోలంతా సమ్మర్ కారణంగా షూటింగుల నుంచి బ్రేక్ తీసుకున్నారు.
ప్రస్తుతం కర్ణాటక లో డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ షెడ్యూల్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ మరికొద్ది రోజుల్లో ఆ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని బ్రేక్ తీసుకోబోతున్నాడని వార్తలొస్తున్నాయి. పాలిటిక్స్ కారణంగా పవన్ సినిమాలకు బ్రేక్ రాగా, నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతున్న నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ29కు బ్రేక్ వచ్చింది. సర్జరీ చేయించుకుని రెస్ట్ లో ఉన్న ప్రభాస్ సమ్మర్ బ్రేక్ తీసుకోగా, రామ్ చరణ్ సమ్మర్ కారణంగానే బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది.






