Animal2: బాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ లో టాలీవుడ్ నటుడు?

బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో రణ్‌బీర్ కపూర్(ranbir kapoor) హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక(rashmika) హీరోయిన్ గా నటించిన సినిమా యానిమల్(animal). అర్జున్ రెడ్డి(arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అయితే యానిమల్ సినిమాకు సీక్వెల్ గా యానిమల్2(animal2) రానున్న సంగతి తెలిసిందే.
యానిమల్2 ను సెట్స్ పైకి తీసుకెళ్లేలోపు సందీప్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో కలిసి స్పిరిట్(spirit) సినిమాను చేయాల్సి ఉంది. ఆల్రెడీ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ను పూర్తి చేసిన సందీప్, ఇప్పటికే 70% ఆర్ఆర్ ను కూడా కంప్లీట్ చేశానని చెప్పాడు. ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే లేట్ స్పిరిట్ ను ఆరు నెలల్లో రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్.
స్పిరిట్ తర్వాత సందీప్, యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను చేయనుండగా, ఆ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉందని, దాని కోసం ఓ టాలీవుడ్ స్టార్ ను తీసుకోవాలని ప్లానింగ్ లో సందీప్ ఉన్నాడని తెలుస్తోంది. దీంతో యానిమల్2 లో నటించే ఆ తెలుగు నటుడెవరని అందరూ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. చూస్తుంటే యానిమల్2 కోసం సందీప్ ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.