సిసిసి ద్వారా సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు ఉచితంగా కోవిడ్-19 టీకా : చిరంజీవి ట్వీట్
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా ఉచితంగా కోవిడ్-19 టీకా ఇప్పించనున్నామని మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని చిరంజీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని “తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.” చిరంజీవి షేర్ చేశారు. గతేడాది కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరంజీవి దాని ద్వారా గత ఏడాది ఎంతోమంది సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు, సాయం చేసిన సంగతి తెలిసిందే.













