హ్యూస్టన్‌లో స్టార్స్ క్రికెట్ మ్యాచ్
సంక్షేమమే లక్ష్యంగా ఎంటర్టైనింగ్ టోర్నీకి ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ క్రికెట్ అసోషియేషన్. ఈ ఏడాదీ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సినీ స్టార్లు ముందుకొచ్చారు. హీరో తరుణ్ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే మంచి కాజ్ కోసం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాం. ఈస్ట్‌వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వరప్రసాద్ యూఎస్‌లోని హ్యూస్టన్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో క్యాన్సర్ పేషంట్ల కోసం, మరో సారి బ్లైండ్ ఛారిటీ కోసం మ్యాచ్ ఆడాం. ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీకోసం ఆగస్టు 17న మ్యాచ్ అడుతున్నట్టు చెప్పారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజేషన్‌తో వచ్చే ఐదేళ్లపాటు ప్రతి ఆర్నెల్లకూ మ్చాచ్‌లు ఆడటానికి ఒప్పందాలు చేసుకున్నామన్నారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ మంచి కాజ్‌కోసం విదేశాల్లో క్రికెట మ్యాచ్ ఆడటం కొత్త అనుభూతి కలిగిస్తోదన్నారు. సమావేశంలో నటుడు పృథ్వి, హీరో శ్రీకాంత్, భూపాల్, సుధీర్‌బాబు, ఖయ్యూమ్ తదితరులు మాట్లాడుతూ విదేశాల్లో ఎన్నారైలతో మ్చాచ్ ఆడాల్సి రావడం ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. ఈవెంట్ విజయవంతం కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.













