ఓటేసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందఠంగా ఓటు వేసిన వారు తమ గుర్తును చూపిస్తూ మీరు కూడా ఓటు వేయండని సలహా సైతం ఇచ్చారు. టాలీవుడ్ సినీ ప్రముఖులకు సంబంధించి నాగార్జున, రాజవౌళి,చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సుధీర్‌బాబు, మాధవన్, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, కీరవాణి, తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.













