చప్పట్లతో సంఘీభావం
దేశవ్యాప్తంగా ఒకరోజు జనతా కర్ఫ్యూ విజయవంతంగా ముగిసింది. ఈ కర్ఫ్యూకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ సినీతారలు తమ హర్షాన్ని తెలిపారు. కరోనా వ్యాప్తి అడ్డుకునేందకు వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, అధికారులు, పాలకులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ధైర్యాన్ని, స్థైరాన్ని నింపేందుకు సంఘీభావంగా చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. చిరంజీవి ఆయన తల్లి అంజనా దేవి, రామ్ చరణ్, జీవిత రాజశేఖర్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మోహన్‌బాబు, మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న, గోపీచంద్, పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.













