టైటానిక్ రీ రిలీజ్..?
జేమ్స్ కామెరూన్ అద్భుత కావ్యం “టైటానిక్”. 1997 లో రిలీజైన ఈ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచనాలని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్ కామెరూన్ కి ఈ సినిమాతో ప్రపంచ కీర్తి లభించింది. సినిమా సినిమాకి కొన్ని ఏళ్ళ సమయం తీసుకున్నా ప్రతి సినిమాని గుర్తుండిపోయేలా తీస్తున్నారు జేమ్స్. లేటెస్ట్ గా డైరెక్ట్ చేసిన అవతార్ 2 కూడా అదే రేంజ్ లో హిట్టయ్యి మంచి రెస్పాన్స్ ని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో వరల్డ్ ఫేమస్ టైటానిక్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు జేమ్స్ కేమెరూన్. అవతార్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టైటానిక్ లో చివరి సీన్ లోని ఒక సీన్ ని రీషూట్ చేసారు. ఒక డోర్ మీద రోజ్ ని కాపాడి జాక్ దాన్ని దూకేస్తాడు. అయితే ఒక్క డోర్ పై ఇద్దరు వ్యక్తులు ఉండలేరా అంటూ జేమ్స్ కామెరూన్ పై కొందరు ప్రశ్నలు వేశారట.
అందుకు సమాధానంగా ఈ డైరెక్టర్ రీసర్చ్ చేసి మరి ఇద్దరు వ్యక్తులు నీటిలో డోర్ పై ఉండలేరని తెలుసుకున్నారట. దాన్ని ఒక డాక్యుమెంటరీగా కూడా తీసినట్టు చెప్పుకొచ్చారు. టైటానిక్ ఒక అందమైన ప్రేమ కథ. జాక్ రోజ్ ల లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ సీన్ లో ఆ డోర్ మీద ఇద్దరికి సరిపోయేంత ప్లేస్ ఉందని ఇప్పటికీ కొందరు తనతో వాదిస్తారని అన్నారు జేమ్స్ కామెరూన్. దానికి మేము చాలా రీసెర్చ్ చేశామని అన్నారు.
ఇక టైటానిక్ రీ రిలీజ్ లో ఇది కాస్త కొత్తగా ఉండబోతుందని అన్నారు దాన్ని ఇంకాస్త స్పెషల్ గా చూపించబోతున్నామని అన్నారు జేమ్స్. సరికొత్త హంగులతో టైటానిక్ సినిమా రీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని 2023 వాలెంటైన్స్ వీక్ లో రిలీజ్ చేస్తామని అన్నారు. ఇదే కాదు ఈ సినిమా కోసం కేట్, లియో లాగ ఉన్న ఒక ఇద్దరు స్టంట్ మాస్టర్స్ ని తీసుకుని వారి లోపల సెన్సార్స్ ఉంచి వారిని మంచు నీటిలో పెట్టాము.. అక్కడ వారు ఎంతసేపు ఉండగలరు అన్నది టెస్ట్ చేశాము.. కాని వారిద్దరు అక్కడ ఎక్కువ సేపు ఉండలేరు. అక్కడ ఒక్కరు మాత్రమే బ్రతకగలరని ప్రాక్టికల్ గా ప్రూవ్ అయ్యింది. అందుకే జాక్ చనిపోయాడని అన్నారు జేమ్స్ కామెరూన్.
టైటానిక్ రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు జేమ్స్ కామెరూన్. ఈ ఏడాది చివర్లో అవతార్ 2 సందడి చేస్తుండగా, వచ్చే ఫిబ్రవరిలో టైటానిక్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. ఈ సారి కూడా ప్రేమికుల మాసుల్లో చేరి టైటానిక్ మరోసారి చరిత్ర తిరగరాయాలని కోరుకుందాం.













